నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ – యం.రాజేష్ చంద్ర, 

నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

– యం.రాజేష్ చంద్ర,

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 20. (అఖండ భూమి న్యూస్);

బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అవసమగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

బుధవారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించాలని చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు.

కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ, ప్రతి కేసులో సాక్షులు మరియు ముద్దాయిలకు సమన్లు తప్పనిసరిగా అందేలా చూసి త్వరగా నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

జిల్లాలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారిపై గట్టి నిఘా ఉంచాలి అని, వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు.

ఈ నెలలో నమోదైన కేసులపై పోలీస్ స్టేషన్ వారీగా సమీక్ష నిర్వహించి, అన్ని కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో సకాలంలో నమోదు చేయాలని సూచించారు.

పాత పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించి, వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

ప్రజల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించి, కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మహిళలపై జరిగే నేరాలపై వేగవంతమైన విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

యువత ఆన్‌లైన్ బెట్టింగ్ వలలో పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, బెట్టింగ్‌ను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తెలియజేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. నర్సింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!