ముత్యంపేట ఫోటోగ్రాఫర్ కుటుంబానికి అండగా నిలిచిన కామారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 20 (అఖండ భూమి న్యూస్);
వివిధ మండలాల ఫోటోగ్రాఫర్ల నుంచి రూ.1,13,500 ఆర్థిక సహాయం అందజేత
ప్రజావాయిస్ – దోమకొండ
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బసవరాజు కుటుంబానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు అండగా నిలిచారు. బసవరాజు మరణంతో విషాదంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన ఫోటోగ్రాఫర్లు, ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు కలిసి బసవరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం రూ.1,13,500 నగదును కుటుంబ సభ్యులకు అందించారు.
మండలాల వారీగా అందించిన సహాయం వివరాలు ఇలా ఉన్నాయి:
దోమకొండ మండల కేంద్రం – రూ.23,500
మాచారెడ్డి మండలం – రూ.21,000
సదాశివనగర్ మండలం – రూ.10,000
బీబీపేట్ మండలం – రూ.5,000
ఇతర మండలాల ఫోటోగ్రాఫర్ల సహకారంతో కలిపి మొత్తం – రూ.1,13,500 సహకారం అందించారు.
ఈ సందర్భంగా పలువురు ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఎప్పుడూ తమ సహకారం ఉంటుందని తెలిపారు. సహచరుడి కుటుంబానికి తోడుగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామస్థులు మరియు ఫోటోగ్రాఫర్ సంఘ సభ్యులు ఈ సహాయ కార్యక్రమాన్ని అభినందించారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


