ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోతున్న పత్తి పంటలకు నష్టపరిహారం ప్రకటించాలి…!

ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోతున్న పత్తి పంటలకు నష్టపరిహారం ప్రకటించాలి…!

వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు.. ఎండిపోతున్న పత్తి పంటలు

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి

ప్రతినిధి కురుపాటి గణేష్ (అఖండ భూమి) ఆగస్ట్ 18

చండూరు మండలం..

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్ అన్నారు..వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు చూస్తుండగా, మరోవైపు పొలాల్లో పత్తి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు,పత్తి సాగు కోసం రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల రూపంలో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారని, తీరా పంట కీలక దశలో వర్షాలు లేకపోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయని కొమ్ము గణేష్ పేర్కొన్నారు..ఇప్పటికే పలు ప్రాంతాల్లో పత్తి మొక్కలు వాడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు..ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతే ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతుల పరిస్థితిని పరిశీలించాలని ఆయన కోరారు..ప్రతి మండలంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంట నష్టం సర్వే నిర్వహించాలని కోరారు, ఎండిపోతున్న పత్తి పంటను వెంటనే గుర్తించి, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు తగిన నష్టపరిహారం ప్రకటించి, నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కొమ్ము గణేష్ కోరారు..పంట నష్టం సర్వేలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు,రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారని, వర్షాభావ పరిస్థితుల్లో పంట చేతికి రాకపోతే అప్పుల భారం మరింత పెరిగి రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు..ప్రభుత్వం రైతుల బాధను అర్థం చేసుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు..“రైతు నష్టపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే నష్టపోయినట్లే..పత్తి పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ప్రభుత్వం అత్యవసర సమస్యగా పరిగణించి వెంటనే పంట నష్టం సర్వే చేపట్టి నష్టపరిహారం ప్రకటించాలి..రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయకూడదు” అని కొమ్ము గణేష్ స్పష్టం చేశారు…

Akhand Bhoomi News

error: Content is protected !!