ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు…!

ప్రతినిధి కురుపాటి గణేష్
(అఖండ భూమి) ఆగస్ట్ 20 చండూరు న్యూస్…
మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు పట్టణం బస్టాండ్ ఏరియాలోని రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, చండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు..దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ అందించిన సేవలను, ఆధునిక సాంకేతిక రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వారు స్మరించుకున్నారు..ముఖ్యంగా సమాచార సాంకేతికత, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో అయన సుకొచ్చిన సంస్కరణలు దేశ ప్రగతికి పునాదులు వేశాయని పేర్కొన్నారు..గురువారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి, చండూరు మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోడి గిరి బాబు, చండూరు మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ సుజావుద్దీన్, చండూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోమ లింగస్వామి, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు, మాజీ సర్పంచ్ సాపిడి రాములు, ఇరిగి రాజు, చండూరు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంట అశోక్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


