ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు…!

ప్రతినిధి కురుపాటి గణేష్
(అఖండ భూమి) ఆగస్ట్ 20 నల్లగొండ జిల్లా…
భారత సాంకేతిక విప్లవ పితామహుడు, దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించాయి..పట్టణంలోని ఎస్.పి. కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో శాసనమండలి విప్, ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్, మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు పున్న కైలాష్ నేత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు..ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నవభారత నిర్మాణంలో మరియు దేశంలో సమాచార, సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడంలో రాజీవ్ గాంధీ ఆనాడు వేసిన పునాదులే నేటి ఆధునిక రంగానికి మూలస్తంభాలని కొనియాడారు..యువతకు, పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజీవ్ గాంధీ అందించిన ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కాంగ్రెస్ కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకుసాగుతోందని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


