సాంకేతిక రంగాల మూలపురుషుడు రాజీవ్ గాంధీ…!

సాంకేతిక రంగాల మూలపురుషుడు రాజీవ్ గాంధీ…!

•నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత

ప్రతినిధి కురుపాటి గణేష్

(అఖండ భూమి) ఆగస్ట్ 20 నల్లగొండ జిల్లా…

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో వారి చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించిన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు పున్న కైలాష్ నేత..అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు దేశం ఆర్థికంగా, శాస్త్ర, సాంకేతికంగా పురోగమించడానికి రాజీవ్ గాంధీ కృషి చేశాడని కొనియాడారు..టెలిఫోన్, కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక రంగాలను భారత్ లో ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నేత అని అన్నారు..21 సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలు చేసి యువతను దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం చేసిన మహానీయుడని పేర్కొన్నారు..దేశం కోసం బలి ధనం చేసిన రాజీవ్ గాంధీని దేశం ఎప్పటికీ మరువబోదని అన్నారు…ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లాపల్లి పరమేష్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు చింత యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి దొండ రమేష్, జిల్లా కార్యదర్శి దామనూరి అశోక్, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, పళ్ళ రవితేజ, ఎండి అజీజ్, మట్టపల్లి నాగరాజ్, శ్రీనివాస్, వేముల గోపీనాథ్, ఇందనూరి శ్రీను, జమ్మూ అశోక్, లింగస్వామి, యాదగిరి, మాచగిరి, గణపురం మహేష్, పున్న గణేష్, కత్తుల గణేష్, అనిల్ కుమార్, నల్లబోతు శంకర్, అకంటి సైదులు, యశ్వంత్, రాజేష్, బాలకృష్ణ, పులుసు నాగార్జున, సచిన్, వినీత్, శరత్, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు….

Akhand Bhoomi News

error: Content is protected !!