పుల్లెంలలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ ఎన్నిక…!

పుల్లెంలలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ ఎన్నిక…!

 

ప్రతినిధి కురుపాటి గణేష్

(అఖండ భూమి) ఆగస్ట్ 18 చండూరు మండలం…

మాదిగ జాతి అభ్యున్నతికి, వారి రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకు రాబోయే రోజుల్లో మరో విడత బృహత్తర పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) మండల నాయకులు పిలుపునిచ్చారు..నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం పుల్లెంల గ్రామంలో ఆదివారం నాడు ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ శాఖ ఎన్నికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ చండూరు మండల అధ్యక్షులు గుండెల శ్రవణ్ మాదిగ, మండల అధికార ప్రతినిధి ఎలవర్తి ప్రవీణ్, మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) చండూరు మండల అధ్యక్షులు పోలే సురేష్, మండల ఉపాధ్యక్షులు పోలే గిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ…సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం గ్రామీణ స్థాయి నుంచే బలమైన ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు..ఎమ్మార్పీఎస్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తూ, గ్రామంలోని సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు..నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ప్రజా ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు..గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..గౌరవ అధ్యక్షులు సీత యాదయ్య, ఇరిగి బుచ్చయ్య, చెడుబుద్ధి ఉషయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు సీత మల్లయ్య, ఉపాధ్యక్షుడు ఇరిగి వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోలే రవి నూతనంగా ఎన్నికైన బాధ్యులు మాట్లాడుతూ…తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మాదిగల హక్కుల సాధనకు, ఎమ్మార్పీఎస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పోలే మహేష్, చెడుబుద్ధి మోహన్, ఇరిగి శివ, పోలే బిక్షం, ఇరిగి హరికాంత్, పెసర్ల హరీష్, పోలే శ్రీను, ఊరుపక్క శివ, పోలే చంద్రయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….

Akhand Bhoomi News

error: Content is protected !!