మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము…!

చండూరులో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేయడానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు ఆహ్వానం
మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
నేను అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా…నువ్వు రాజకీయాల నుండి తప్పుకుంటావా…
ప్రతినిధి కురుపాటి గణేష్
(అఖండ భూమి) ఆగస్ట్ 18 చండూరు మున్సిపాలిటీ…
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలో మంగళవారం నాడు ప్రభుత్వ అతి గృహం నందు స్థానిక మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు..ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిన్న నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు…కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై వాస్తవాలను ప్రజలకు వివరించకుండా రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదన్నారు..కొన్ని దశాబ్దాల కాలంగా బస్సు షెల్టర్ల కోసం ఎదురుచూస్తున్న చండూరు ప్రజల వారికోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తమ తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో బస్ షెల్టర్ నిర్మాణం ప్రారంభిస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు అది అవసరం లేదని మాట్లాడటం, దాని నిర్మాణం మొదట పండ్ల బండ్ల దగ్గర నిర్మిస్తామని చెప్పి వారి దగ్గర 12 లక్షలు తీసుకున్నారని ఆరోపించడం, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ డబ్బులు తీసుకున్నారని, వైన్ షాపుల దగ్గర, పండ్ల బండి వారి దగ్గర, ప్రైవేట్ హాస్పిటల్స్ వద్ద, కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర లక్షల రూపాయలు తింటున్నారని దేవుని దగ్గర ప్రమాణం చేస్తానని మాట్లాడారని, మీ మాట ప్రకారం మేము శనివారం రోజు ఉదయం 9 గంటలకు నేను, మున్సిపాలిటీ పాలకవర్గం అందరం మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ప్రమాణం చేస్తామని, మేము డబ్బులు తీసుకున్నట్లు మీరు ప్రమాణం చేయాలని అన్నారు..ఎక్కడైనా ఒక రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే నేను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని…నువ్వు రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా కావడానికి సిద్ధమా? అని అన్నారు..కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్ మాట్లాడుతూ…కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక మాజీ ఎమ్మెల్యే అని మరిచిపోయి, కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చండూరులో అడుగుపెట్టనివ్వబోమని అన్నారు..పండ్ల బండి వ్యాపారులు, వైన్స్ యాజమాన్యం ప్రెస్ మీట్ లో పాల్గొని ఎవరికీ ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదని, మున్సిపల్ చైర్మన్ పై అబాండాలు మోపితే సహించమని, మేమందరం శనివారం గుడికి వచ్చి డబ్బులు ఎవరికి ఇవ్వలేదని ప్రమాణం చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, 2వ వార్డు కౌన్సిలర్ బుషిపాక వాసు, 7వ వార్డు కౌన్సిలర్ కోడి సుష్మ-వెంకన్న, మాజీ సర్పంచ్ కోడి గిరి బాబు, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సతమ్మ-వెంకన్న, కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ సలీమా-షరీఫ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ కన్నెబోయిన నాగరాజు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు ఏలే శ్రీనివాసులు, జూలూరు వెంకటేశం, పన్నాల లింగయ్య, కారింగు రామ్మూర్తి, బొమ్మరబోయిన వెంకటేశం, పున్న సైదులు, సమీర్,బుషిపాక సురేష్, కారింగు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు…


