ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేరుతుంది..‌.!

ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేరుతుంది..‌.!

చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్నిస్తుంది

ప్రతినిధి కురుపాటి గణేష్

(అఖండ భూమి) ఆగస్ట్ 18 చండూరు మున్సిపాలిటీ…

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలోని 8వ వార్డుకు చెందిన గండూరి సత్యనారాయణ నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమము చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది..ఈ సందర్భంగా చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ…పేదల సొంత ఇంటికాలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పేదలకు ఒక వరం లాంటిదని తెలిపారు..ఈ సందర్భంగా గండూరి సత్యనారాయణ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు..ఇట్టి గృహ ప్రవేశ కార్యక్రమముకు చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, 2వ వార్డు కౌన్సిలర్ బుషిపాక వాసు, 4వ వార్డు కౌన్సిలర్ జెల్ల ధనమ్మ-శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, 10వ వార్డు కౌన్సిలర్ కటకం రమేష్, వార్డు ఆఫీసర్స్ ఏ. జగన్, బి. సాయిరాం మరియు బిల్ కలెక్టర్లు జి. మహేష్, జి. రమేష్ తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!