*స్పోర్ట్స్ డేలో స్వర్ణం సాధించిన జనగామ రోహిన్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 21 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక – యువజన వారోత్సవాలు”లో భాగంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి (డీవైఎస్‌వో) రంగ వెంకటేశ్వర్ గౌడ్ హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అలాగే జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు యోగా రాంరెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. జనగామ రోహిత్ రెడ్డి స్వర్ణ పతకం సాధించి ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. విజేతలకు పతకాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకుని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పతక విజేతలందరికీ అభినందనలు తెలిపారు.
You may also like
*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: రోగులకు పండ్ల పంపిణీ…*
ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు – కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం 22 న సత్య కన్వెన్షన్ హాల్
దోమకొండ లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి…


