ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు
– కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 21. (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోనీ దోమకొండ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నిర్వహించిన హెచ్ డి సి ( హాస్పిటల్ డెవలపెంట్ కమిటీ) సమావేశంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా వైద్యులు మరియు ఆసుపత్రి అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని, పేద వారు మాత్రమే ప్రభుత్వ దవాఖాన కి వస్తారు కాబట్టి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, అత్యవసరం అయితే తప్ప రోగులు జిల్లా కేంద్రానికి పోకుండా సేవలు అందించాలి అని అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


