*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: రోగులకు పండ్ల పంపిణీ…* 

*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: రోగులకు పండ్ల పంపిణీ…*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 21.(అఖండ భూమి న్యూస్);

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను కామారెడ్డి జిల్లా దోమకొండ మండలకేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశ పోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా అరటి పండ్లు పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ యువతకు ఆయన ఎల్లప్పుడూ ఒక గొప్ప ఆదర్శమూర్తి అని పేర్కొన్నారు.”రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే దేశ ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు.యువత రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని ఆయన బలంగా ఆకాంక్షించారు. అందుకోసమే ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించి, యువతకు దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించారు. అలాగే దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి పునాది వేసి, కొత్త ఒరవడులు సృష్టించడం ద్వారా నేటి తరం యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభించేలా చేశారు.” పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులుపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మాజీ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు, జిల్లా కాంగ్రెస్ జనరల్ తాటిపల్లి శ్రీకాంత్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, చాముండేశ్వరి ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి, శంకర్ రెడ్డి నల్ల పు శ్రీనివాస్, నర్సారెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు షమ్మీ, అబ్రబోయిన రాజయ్య, కాంగ్రెస్ మండల యువజన యూత్ అధ్యక్షులు పిన్నం నాగేంద్ర వర్మ, బాలే సురేందర్ లింగుపల్లి నరసింహులు అంచనూరు రాంరెడ్డి, దుంపాల ప్రతాపరెడ్డి, అబ్రబోయిన రాజు, లక్ష్మీ నరసింహ ఆలయ చైర్మన్ బుర్ర బాపురెడ్డి, గాజులపల్లి నరసింహులు శేఖర్ రెడ్డి నాగారపు నరసింహులు, నీల పోషవ్వ, చంద్రశేఖర్, అంచనూరు నరేష్, నయీమ్, కూర సంతోష్, నేతుల మల్లేష్ యాదవ్, నేతుల సుధాకర్ యాదవ్, కొమ్ము రమేష్, సిరాజ్, కలీమ్, రసూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!