ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 22 (అఖండ భూమి న్యూస్);
సామాజిక సంస్కర్త, దళితోద్యమ ప్రముఖ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలను శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన గావించి, భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. విద్య, సామాజిక సమానత్వం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్యే ప్రధాన ఆయుధమని భావించి, వారికి చైతన్యం కల్పించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు.
భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమానత్వ భావనతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, SC డెవలప్మెంట్ officer వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


