పారదర్శక పరిపాలన అందించడమే రేవంత్ రెడ్డి సర్కార్ ధ్యేయం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 22 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలో పారదర్శక పరిపాలన అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శుక్రవారం
కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు హాజరయ్యారు.
కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ,కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను కేంద్రబిందువుగా తీసుకొని పారదర్శక పరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా చేరే విధంగా అధికారులు పని చేయాలని సూచించారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కేవలం సమీక్ష సమావేశాలకు పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణాల్లో కనిపించే మార్పుగా మారాలని అన్నారు.
ప్రతి శాఖకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించిందని, వాటి అమలులో వేగం పెంచాలని సూచించారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని అన్నారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఉండాలని, సమయపాలనతో పనులు పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మున్సిపాల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ గిరి, డీఎస్పీ మధుసూదన్, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు లక్ష్మి, పాత రాజు, పట్టణ అధ్యక్షులు సందీప్, కౌన్సిలర్లు అంజాద్, వాజీద్, మజీద్, కాళ్ళ గణేష్, గడ్డమీది మహేష్, లడ్డు, సత్యం, షేరు, జిల్లా నాయకులు అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొనె శ్రీనివాస్, సుదర్శన్, మండల అధ్యక్షులు రాజగోడ్, శ్రీనివాస్, నౌసిలాల్, కృష్ణ రావు, మాజీ మండల అధ్యక్షులు సుతారి రమేష్, అనంత్ రెడ్డి, గూడెం శ్రీనివాస్, యాదవ రెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
You may also like
ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు …
*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: రోగులకు పండ్ల పంపిణీ…*
ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు – కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం 22 న సత్య కన్వెన్షన్ హాల్


