ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాట్రన్ మెంబర్‌గా డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి…

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాట్రన్ మెంబర్‌గా డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి…

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా సన్మానం

వైస్ పాట్రన్ సభ్యత్వం పొందిన ఎం. సదాశివ రెడ్డి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్);

రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలి : జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక స్వచ్ఛంద సేవా సంస్థ “ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ”లో స్థానిక ఆర్.కె. విద్యాసంస్థల సీఈఓ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి పాట్రన్ మెంబర్‌గా (రూ.25,000 సభ్యత్వం) చేరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ డాక్టర్ జైపాల్ రెడ్డిని శాలువాతో సత్కరించి సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి అభినందించారు.

అదేవిధంగా ఎం. సదాశివ రెడ్డి రెడ్ క్రాస్ సొసైటీలో వైస్ పాట్రన్ సభ్యత్వం (రూ.12,000) స్వీకరించగా, కలెక్టర్ వారికి మెమెంటోను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజ సేవలో విశేష పాత్ర పోషిస్తున్న డాక్టర్ జైపాల్ రెడ్డి వంటి వ్యక్తులు రెడ్ క్రాస్ వంటి అంతర్జాతీయ గుర్తింపు కలిగిన సేవా సంస్థలో సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమన్నారు. జిల్లాలోని యువత తమ విలువైన సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించి రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యువత, విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు సేవలందించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలోని ప్రముఖులు, యువత, విద్యార్థులు కూడా రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏసీఎల్ బి గిరి, రెడ్ క్రాస్ నోడల్ అధికారి శశికుమార్, డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి, మర్రి సదాశివ రెడ్డి, దత్తాద్రి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!