*రూ.2.11 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ …

*రూ.2.11 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ …

20 ఏళ్ల కళ సకారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం, చిట్యాల గ్రామ ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం కల ఎట్టకేలకు సాకారమైంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే *మదన్ మోహన్ రూ.2.11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

గత సంవత్సరం 02-05-2025*న ఈ ఉపకేంద్రానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేయగా, అధికారులతో సమన్వయం చేస్తూ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ఏడాది వ్యవధిలోనే ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో చిట్యాల ప్రజల్లో ఆయనపై మరింత విశ్వాసం పెరిగింది.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, *”మాటిచ్చాడంటే నిలబెట్టుకుంటాడు అనే నమ్మకానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ మరోసారి నిదర్శనంగా నిలిచారని ఆన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి కొత్త దిశను చూపారని కొనియాడారు.

ఈ 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో *చిట్యాల, సంతాయిపేట్ ,సోమారం , అన్నారం తండా గ్రామాలకు* దీర్ఘకాలంగా ఉన్న *లో వోల్టేజ్ విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం* లభించనుంది. దీంతో వ్యవసాయానికి, గృహ వినియోగానికి, చిన్న వ్యాపారాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందే అవకాశం ఏర్పడింది అని కొనియాడారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషికి ఈ విద్యుత్ ఉపకేంద్రం మరో మైలురాయిగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!