*ఫరీద్‌పేటలో సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దిష్టిబొమ్మ దహనం..!
* _సర్పంచ్‌పై పంచాయతీ కార్యాలయంలో వాగ్వాదం..
* సర్పంచ్ తీరుపై గ్రామస్తులు వార్డు సభ్యులు గరం గరం..
* _వైస్ ఎంపీపీ, ఇన్‌చార్జ్ ఎంపీపీ కాలంలోనే డబుల్ బిల్లింగ్ దందా ..ఇప్పుడు సర్పంచ్ పదవిలో మరో రూ. 11 లక్షల భారీ స్కామ్ పై తేల్చాలని డిమాండ్..
* _ఎలక్ట్రికల్ షాప్ పేరు మీద డీజిల్, జేసీబీ, శానిటేషన్ బిల్లుల ఫోర్జరీ: కలెక్టర్ విచారణకు ఆదేశం.?
* _ అవినీతికి ఇద్దరు అధికారులు బలి అవుతున్నారు” – వార్డు సభ్యుల నిలదీత..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామంలో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసి రూ. 4,05,036/- ల ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు జిల్లా కలెక్టర్ విచారణలో అధికారికంగా నిరూపితం కావడంతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సామాజిక కార్యకర్త గుర్జాల మధుసూదన్ రెడ్డి పక్కా ఆధారాలతో చేసిన ఫిర్యాదుపై సంయుక్త కమిటీ విచారణ జరిపి, కాంట్రాక్టర్ జీడిపల్లి లత నుండి నిధుల రికవరీకి, అధికారులపై షోకాజ్ నోటీసులకు కలెక్టర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ అవినీతి భాగోతంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ఫరీద్‌పేట్ గ్రామ ప్రజలు , వార్డు సభ్యులు రమాదేవి, జ్యోతి, ప్రత్యూష, నర్సింహులు, వెంకట్ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అవినీతికి ప్రధాన సూత్రధారులైన సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, దిష్టిబొమ్మను గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిప్పుపెట్టి దహనం చేశారు. అనంతరం ప్రజాధనాన్ని నిలువునా ముంచిన ఇలాంటి అవినీతి సర్పంచ్ మాకు వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు , వార్డు సభ్యులు.. సర్పంచ్ నరసింహారెడ్డిని గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే బయటకు రావాలని నిలదీశారు.
పాత అక్రమాలతో పాటు.. సర్పంచ్‌గా రూ. 11 లక్షల కొత్త దందా..!
ఈ సందర్భంగా గ్రామ వార్డు సభ్యులు సర్పంచ్ నరసింహారెడ్డి అవినీతి చరిత్రను బట్టబయలు చేశారు. ఇప్పుడు రికవరీ ఆర్డర్ వచ్చిన రూ. 4.05 లక్షల డబుల్ బిల్లింగ్ దందా అంతా నరసింహారెడ్డి గతంలో వైస్ ఎంపీపీగా, ఇన్‌చార్జ్ ఎంపీపీగా ఉన్న కాలంలో అడ్డగోలుగా సాగించిన అక్రమమేనని వారు స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా, ఇటీవల ఆయన సర్పంచ్ పదవిలోకి వచ్చిన తర్వాత ఏకంగా రూ. 11 లక్షల నిధులను అక్రమంగా విత్‌డ్రా చేశారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ రూ. 11 లక్షల కొత్త దందాపై కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం దీనిపై కూడా పక్కా ఆధారాలతో అధికారిక విచారణ వేగంగా సాగుతోందని వారు వెల్లడించారు.
ఎలక్ట్రికల్ షాప్ పేరుతో డీజిల్, జేసీబీ బిల్లులా..?
సర్పంచ్ నరసింహారెడ్డి చేసిన ఫోర్జరీ అక్రమాలను వార్డు సభ్యులు రమాదేవి, జ్యోతి, ప్రత్యూష, నర్సింహులు, వెంకట్ మీడియా ముందు కడిగిపారేశారు. సర్పంచ్ పదవి అధికారంతో ఒక ఎలక్ట్రికల్ షాప్ పేరు మీద ఏకంగా డీజిల్ బిల్లులు, జేసీబీ బిల్లులు, మరియు శానిటేషన్ బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్మును ఎలా నొక్కేస్తావని వారు నిలదీశారు. ఎలక్ట్రికల్ షాప్‌కు, డీజిల్, జేసీబీ బిల్లులకు సంబంధం ఏంటని, ఈ దొంగ బిల్లుల వెనుక ఉన్న అసలు గుట్టంతా ఇప్పుడు జరుగుతున్న కలెక్టర్ విచారణలో త్వరలోనే బయటపడుతుందని వెల్లడించారు.
_నీ అవినీతి ఆకలికి ఇద్దరు అధికారులు బలి.ఎం!_
“నువ్వు చేసిన స్వార్థపు అవినీతి వల్ల, దొంగ బిల్లుల వల్ల ఈరోజు ఇద్దరు ప్రభుత్వ అధికారులు (అప్పటి ఏ ఈ ఈ ఎన్. వెంకటేష్, డి వై. ఈ ఈ మురళి) బలి అవుతున్నారు అని వార్డు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ తప్పుడు పనులకు వంతపాడి, నీ అక్రమ సంపాదనకు సహకరించినందుకు ఈరోజు ఆ అధికారులు షోకాజ్ నోటీసులు ఎదుర్కొంటూ ఉద్యోగాలు, జీతాలు కోల్పోయే పరిస్థితి తెచ్చావని మండిపడ్డారు.
ఇలాంటి సర్పంచ్ మాకు వొద్దు .. క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే:
వైస్ ఎంపీపీ, ఇన్‌చార్జ్ ఎంపీపీ కాలం నుండి మొదలుకొని.. నేడు సర్పంచ్ పదవి వరకు నిరంతరం ప్రజాధనాన్ని లూటీ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న జీడిపల్లి నరసింహారెడ్డి మాకు సర్పంచ్‌గా వద్దే వద్దని వార్డు సభ్యులు , గ్రామస్థులు తెగేసి చెప్పారు. కలెక్టర్ వెంటనే స్పందించి సర్పంచ్ పదవి నుండి శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని, నరసింహారెడ్డి ఆయన భార్య లతపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని భీష్మించుకు కూర్చున్నారు. లేనిపక్షంలో గ్రామ పంచాయతీ ముట్టడిని ఆపేదే లేదని హెచ్చరించారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ లు, హెల్పర్ పోస్టుల భారతీయ నోటిఫికేషన్ జారీ…
ఎస్ ఆర్ ఐ గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలి…
10 న ఏఐవైఎఫ్ విద్యారంగల సమస్యలపై బంద్…
కే పీ రాజిరెడ్డి జన సేవా ట్రస్ట్ వారి డ్యూయెల్ డిస్క్ బెంచీల పంపిణీ…
*రూ.2.11 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ …


