కే పీ రాజిరెడ్డి జన సేవా ట్రస్ట్ వారి డ్యూయెల్ డిస్క్ బెంచీల పంపిణీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని మండల పరిషత్ పాఠశాలలకు రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ వారి డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ. *కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి* ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి గారి పేరు న ఉన్నటువంటి *కె.పి రాజారెడ్డి సేవా ట్రస్ట్* ఆధ్వర్యంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు డ్యూయల్ డేస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలని, డ్రైవర్స్ కాలని, అడ్లూర్ ఎస్సీ కాలని, అడ్లూర్ మండల పరిషత్ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీలు అందజేశారు. గత విద్యాసంవత్సరం ముగింపు లో నియోజకవర్గంలోని అన్ని హై స్కూల్ లకు విద్యార్థులకు సరిపడా దాదాపు 6 వేల డ్యుయల్ డెస్క్ లు ఇవ్వడం జరిగింది అని, నూతన విద్య సంవత్సరం ప్రారంభం అయిన తరువాత గత 20 రోజుల నుండి నియోజకవర్గం లోని ప్రాథమిక పాఠశాలలకు దాదాపు 8 వేల డ్యూయల్ డెస్క్ లు అందజేస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి గౌరవంగా చదవాలి అనే ఉద్దేశంతో మొదట డ్యూయల్ డెస్క్ బెంచీలు తన సొంత ఖర్చుతో ఇస్తున్నారని అన్నారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ లు, హెల్పర్ పోస్టుల భారతీయ నోటిఫికేషన్ జారీ…
ఎస్ ఆర్ ఐ గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలి…
10 న ఏఐవైఎఫ్ విద్యారంగల సమస్యలపై బంద్…
*రూ.2.11 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ …
*ఫరీద్పేటలో సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దిష్టిబొమ్మ దహనం..!


