10 న ఏఐవైఎఫ్ విద్యారంగల సమస్యలపై బంద్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్);
10వ. తేదీన వామపక్ష. విద్యార్థి సంఘాలకు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. 10వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాలకు అఖిలభారత యువజన సమైక్య. ఏఐవైఎఫ్. సంపూర్ణ మద్దతిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కన్వీనర్ ఎం ప్రవీణ్, జిల్లా కోకన్వీనర్ దువ్వల నరేష్, రాజు ,ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ పి శివప్రసాద్, జిల్లా నాయకుడు సంపత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ ఐ వైఎఫ్ విద్యారంగ సమస్యల బందుకు మద్దతు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో ,కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని సంక్షేమ హాస్టల్లో వసతులు కల్పించాలని పెరిగిన ధర కనుగుణంగా మిస్ చార్జీలు పెంచాలని అన్నారు. కామారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులను కేజీ నుండి పదో తరగతి వరకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని పుస్తకాలు, పెన్నులు ,పెన్సిళ్లు, లబ్బర్లు, యూనిఫామ్ పేరుతో తల్లిదండ్రుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని వారన్నారు. ఇప్పటికైనా కామారెడ్డి డివో కళాశాలకు సంబంధించిన అధికారులు తక్షణమే జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని పాఠశాలలను కళాశాలలో మూసివేయాలని తోక పేర్లతో ఉన్న మోడల్స్ బ్రిలియంట్ గ్లామర్ పేర్ల తొలగించాలని ఉన్నారు. బాన్సువాడలో చైతన్య నారాయణ కార్పోడ్ విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు. లేనియెడల భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఇ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో యువజన ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ లు, హెల్పర్ పోస్టుల భారతీయ నోటిఫికేషన్ జారీ…
ఎస్ ఆర్ ఐ గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలి…
కే పీ రాజిరెడ్డి జన సేవా ట్రస్ట్ వారి డ్యూయెల్ డిస్క్ బెంచీల పంపిణీ…
*రూ.2.11 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ …
*ఫరీద్పేటలో సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దిష్టిబొమ్మ దహనం..!


