ఎస్ ఆర్ ఐ గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలి…

ఎస్ ఆర్ ఐ గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ టెలికాన్ఫెరెన్స్ ద్వారా తెలిపిన సూచన మేరకు  కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆదేశానుసారం ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమం పై పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ అనుగుణంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఆశించిన వేగంతో జరగడం లేదు

2002 ఓటరు జాబితా అనేక ప్రాంతాల్లో ఇప్పటికి బిఎల్ఓ లకు పూర్తిగా అందుబాటులోకి రాలేదనీ అన్నారు.

బిఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు అందించి తిరిగి సేకరించాల్సిన విధానం అమలు కావడం లేదు ఆన్నారు.

జూన్ 25 నుంచి ఇప్పటివరకు ఫారాల పంపిణీ సేకరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు

జూలై 24న గడువు దృశ్య సమయం చాలా తక్కువ ఉంది పారాల పంపిణీ నింపించడం సమర్పణ ప్రక్రియ వేగవంతం చేసి

ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే జూలై 24 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్య పరిస్థితి కనిపించడం లేదు అన్నారు.

జులై 24న గడువులోపు ఏ అర్హుడైన ఓటరు తొలగిపోకుండా అనర్హుడు జాబితాలో మిగలకుండా కట్టుదిట్టంగా పనిచేయాలని ప్రభుత్వానికి మేం సూచిస్తున్నట్టు తెలిపారు.

ఈ సమావేశంలో మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొమ్మెర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు పాలకుర్తి శేఖర్, సీనియర్ నాయకులు మన్నె సాయి రెడ్డి,  బిఆర్ఎస్ పార్టీ బి ఎల్ ఏ లు  బొమ్మెర గంగాధర్, కానుగంటి నాగరాజు, చెన్ను నర్సింలు, కుంచాల సత్యం, విజయ్, నాయకులు బొబ్బసాని శంకర్, మల్లెబోయిన రాజు బీసు శివ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!