కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ లు, హెల్పర్ పోస్టుల భారతీయ నోటిఫికేషన్ జారీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ , అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దోమకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సిడిపిఓ రోషిష్మ బుధవారం తెలిపారు.
మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి ప్రాజెక్టు పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న 21 అంగన్‌వాడీ టీచర్ , 21 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ అనుమతితో నోటిఫికేషన్ విడుదల చేయబడింది అని అన్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు 09-07-2026 నుండి ప్రారంభమై 25-07-2026 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడతాయి. అభ్యర్థులు దరఖాస్తులను http://wdcw.tg.nic.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు అన్నారు.
అభ్యర్థుల వయస్సు 01-07-2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల అనంతరం అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో 28-07-2026 నుండి 31-07-2026 వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు.
పూర్తి అర్హతలు, ఎంపిక విధానం, అవసరమైన ధృవపత్రాల వివరాలు , ఇతర సమాచారం http://wdcw.tg.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అన్నారు.
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


