వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీఆర్ …

వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీఆర్ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 8 (అఖండ భూమి న్యూస్);

హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్–12లో మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి శ్రీధర్ బాబు , ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ , స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ , మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్ రావు , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి , ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు తదితరులు పాల్గొని మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజాసేవ, సంక్షేమ పాలన, రైతులు, పేదలు మరియు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేయడం ఆయనకు అందించే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.

Akhand Bhoomi News

error: Content is protected !!