ఇందిరమ్మ, పారిశుద్ధ్య పనులపై దృష్టి కేంద్రీకరించాలి…

ఇందిరమ్మ, పారిశుద్ధ్య పనులపై దృష్టి కేంద్రీకరించాలి…

మండల ప్రత్యేక అధికారి జ్యోతి..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ మండల ప్రత్యేకాధికారిణి జ్యోతి దోమకొండ మండల ఎంపీడీవో, ఎంపీఓలతో గొట్టిముకుల గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులు, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై తగు సూచనలు జారీ చేశారు. ప్లాస్టిక్ నిర్మూలనపై గొట్టిముకుల గ్రామం మండలం లో పైలట్ విలేజ్ గా సెలెక్ట్ అయినందున అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం దోమకొండ మండల స్థాయి అధికారులు , పంచాయతీ కార్యదర్శులతో మండల పరిషత్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యేకాధికారి జ్యోతి మాట్లాడుతూ. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు సక్రమంగా నిర్వహించాలని, ఆయిల్ బాల్స్ ప్రిపరేషన్, త్రాగునీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని కార్యదర్శులకు సూచనలు చేశారు. గ్రామ సర్పంచ్ లతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని, ఎస్ ఐ ఆర్ సర్వేలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత బి ఎల్ ఓ లతో ,జి పి ఓ లతో ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆన్లైన్ అప్డేషన్ సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీలలో రిజిస్టర్ల నిర్వహణ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు , మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!