కాంట్రాక్ట్ శానిటేషన్ పేషంట్ కేర్, సెక్యూరిటీ గాడ్ కార్మికులకు 26 వేల కనీస వేతనం అందించాలి…
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల జిల్లా అధ్యక్షుడు కే. శ్రీనివాస్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్ కార్మికులు వేతనాల పెంపుపై
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కి వినతిపత్రం. మంగళవారం అందించారు. అనంతరం కామారెడ్డి ఆసుపత్రి ముందు ఆసుపత్రి కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్. పేషంట్ కేర్. సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7 8 తేదీల్లో నిరసన ధర్నా నిర్వహించి జులై 9వ తేదీన రాష్ట్ర కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్న నిర్వహిస్తామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మరియు వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుందనీ అన్నారు. ఈ సందర్భంగా ఈ ధర్నా కు ముఖ్య అతిథిగా మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎల్. దశరథ్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పి బాలరాజ్ మాట్లాడుతూ. ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు సంవత్సరాలుగా కాల పరిమితి టెండర్లను పిలవడం జరిగింది టెండర్ల షెడ్యూల్లో జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించాలని ప్రకారం కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ మినహాయింపు రూపాయలు 13500 రావాల్సి ఉంది కానీ గత నాలుగు సంవత్సరాలుగా కార్మికులకు కేవలం 11 వేల రూపాయలు జీతం మాత్రమే చెల్లిస్తున్నారు అని అన్నారు. టెండర్ల పిలిచే సమయంలో అధికారులు. కాంటాక్ట్ల నిర్లక్ష్య వలన కార్మికులు గత నాలుగు సంవత్సరాలుగా తక్కువ జీతం పొందుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులు జీవించాలంటే కనీస వేతనం 26,000 ఉండాలి కార్మిక సంఘాలన్నీ నిర్ణయించి దేశవ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తున్నాయి అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయుచున్న కార్మికులకు కూడా కనీస వేతనం 26,000 వచ్చే విధంగా టెండర్ లో పొందుపరిచి అమలు చేయాలని నాలుగు పండగ నాలుగు జాతీయ 15 వరకు అర్జిత సెలవులు అమలు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా జమ చేయాలని బోనస్ చట్ట ప్రకారం సంవత్సరానికి ఒక నెల వేతనం బోనస్ గా చెల్లించాలని డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎల్. దశరథ్, ఏఐటియుసి కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి బాలరాజ్, ఏఐటీయూసీ నాయకులు. ఎం ప్రవీణ్, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్, ఎండి రఫీక్ ,సునీత, విజయలక్ష్మి, పద్మ,, భారతి అఖిల, ఫౌజియా, బైరమ్మ, కల్పన, రజిత ,నాగలక్ష్మి, లక్ష్మి, మమత ,సందీప్ ,దశరథ్, నర్సింలు, భాస్కర్, గంగాధర్, సంగమేశ్వర్ ,శ్రీకాంత్, మల్లేష్, నర్సింలు ,గౌతమ్ ,లక్ష్మణ్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు
You may also like
ఇందిరమ్మ, పారిశుద్ధ్య పనులపై దృష్టి కేంద్రీకరించాలి…
ఆటో రిక్షాల్లో విద్యార్థుల అధిక లోడింగ్‌పై ప్రత్యేక తనిఖీలు…
ఎస్ ఐ ఆర్ ప్రత్యేక సవరణ చేసుకుంటున్నా బి ఆర్ ఎస్ పర్యవేక్షణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్…
శబ్దీపూర్ లో ఘనంగా శీతల పండగ…
కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ…


