కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అకాండ భూమిని న్యూస్);
కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విస్తృతంగా చర్చించారు.
అలాగే, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, మహిళలను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములను చేయడం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా చేరవేయడంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు.
ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, పార్టీ బలోపేతం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


