తెలుగుదేశం క్యాడర్ కు స్ఫూర్తినిచ్చిన డిజిటల్ మహానాడు

తెలుగుదేశం క్యాడర్ కు స్ఫూర్తినిచ్చిన డిజిటల్ మహానాడు

తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు

రాజమహేంద్రవరం, అఖండ భూమి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న పార్టీ 2026 లో వినూత్నంగా నిర్వహించిన డిజిటల్ మహా నాడు పార్టీ క్యాడర్కు స్ఫూర్తినిచ్చిందని పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా పార్టీ పిలుపుమేరకు నగరంలో 12 క్లస్టర్లో డిజిటల్ విధానంలో నిర్వహించిన మహానాడులో సుమారు ఎనిమిది వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరన్నారు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందన్నారు. గత ఐదు సంవత్సరాలు వైసిపి ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునారాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అజరామన్నారు. డిజిటల్ మహానాడు ను స్త్రీ శక్తి థీమ్ తో నిర్వహించడం శుభ పరిణామన్నారు. ఈ మహానాడులో స్థానిక సంస్థలలో, శాసన వ్యవస్థలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. పార్టీ తొలినుంచి బీసీలకు, మహిళలకు పక్షపాతగా నిలుస్తుందన్నారు. గతంలో వలె ఒకే చోట మహానాడు నిర్వహించడం కన్నా ఈసారి విభిన్న రీతిలో క్లస్టర్ వైజ్ గా నిర్వహించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు, మండల స్థాయి లక్షలాది మంది క్రింది స్థాయి పార్టీ కేడర్ కు మహానాడులో ప్రత్యక్షంగా పాల్గొన్నంత అనుభూతి కలిగిందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్న ఫోటో కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల ల్లో ను ప్రజల సహకారం అందించాలన్నారు. నగరాభివృద్ధికి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు చేస్తున్న కృషి గతంలో ఏ శాసనసభ్యులు చేయలేదన్నారు. నగరంలో డిజిటల్ మహానాడు ను విజయవంతంగా నిర్వహించడంలోనూ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!