క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం, అఖండ భూమి; యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి, ప్రతిభావంతులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సోనస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోనస్ కార్పొరేట్ క్రికెట్ లీగ్-2026 టోర్నమెంట్ కప్‌ను ప్రముఖ ప్రవాస భారతీయుడు, సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ జేమ్స్ వాట్స్ కొమ్ము ఆవిష్కరించారు.
శనివారం రాజమహేంద్రవరంలోని షెల్టాన్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 12 జట్లు పాల్గొనే ఈ పోటీలు వారాంతాల్లో నిర్వహించబడతాయని, విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేస్తామని చెప్పారు.
సంస్థ సహ వ్యవస్థాపకుడు సామ్యూల్ బాబు మాట్లాడుతూ, రెండో ఏడాది కూడా ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్పొరేట్ సంస్థల సహకారంతో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
డాక్టర్ చిమ్మలరి శ్రీనివాస్ మాట్లాడుతూ, క్రికెట్ క్రీడ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుందని అన్నారు. సినీ నటుడు భద్రం మాట్లాడుతూ, డాక్టర్ జేమ్స్ వాట్స్ కొమ్ము ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ చిమ్మలరి శ్రీనివాస్ రూపొందించిన సోనస్ ఏఐ ఎనీ సెంట్స్ హబ్ సాఫ్ట్‌వేర్‌ను డాక్టర్ జేమ్స్ వాట్స్ కొమ్ము ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఉపయోగపడే ప్రత్యేక యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.
కార్యక్రమంలో టోర్నమెంట్‌లో పాల్గొనే జట్ల కెప్టెన్లు, సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో తొలిసారిగా ఈ లీగ్ మ్యాచ్‌లను లైవ్ స్క్రీన్‌లపై ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
You may also like
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
తెలుగుదేశం క్యాడర్ కు స్ఫూర్తినిచ్చిన డిజిటల్ మహానాడు
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు



