*ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1 గా ఉంచాలి- 
అడిషనల్ కలెక్టర్ వై వి గిరి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15:(అఖండ భూమి న్యూస్);
భారతదేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ ఆర్ సి ఎస్) సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ కామారెడ్డి పట్టణంలోని ఆర్కే (ఆర్ కె ) డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా నిర్వహించబడింది. మే 15 నుండి జూన్ 15 వరకు ప్రభుత్వం విధించిన సభ్యత్వ నమోదు గడువు నేటితో ముగియనుండటంతో, ఈ రోజున ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ వై.వి . గిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా జిల్లా లేబర్ ఆఫీసర్ శశికుమార్ గఎల్, ఆర్కే విద్యాసంస్థల సీఈఓ యం.డాక్టర్ జైపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అడిషనల్ కలెక్టర్ వై. వి .గిరి మాట్లాడుతూ. ప్రస్తుతం రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో (నెంబర్ 1) నిలిచేందుకు అవకాశం ఉందన్నారు. మన జిల్లా కలెక్టర్ గారి సూచనతో ఆర్కే సీఈఓ జైపాల్ రెడ్డి పాట్రన్ మెంబర్ షిప్ తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదుకు చివరి రోజు కావడంతో విద్యార్థులు, యువత, సమాజ సేవకులు, ఉద్యోగ, వ్యాపార వాణిజ్య వేత్తలు , పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి జిల్లాను అగ్రస్థానంలో (నెంబర్ 1) ఉంచాలని చెప్పారు.
డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.
వేయి రూపాయలతో లైఫ్ టైం శాశ్వత సభ్యత్వం 1000 రూపాయలకు
కేవలం రూ. 250 చెల్లించి జీవితకాల అసోసియేట్ సభ్యత్వం పొందే ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సేవా కార్యక్రమాల్లో యువతే కీలకం అనీ ,విపత్తుల సమయంలో, రక్తదాన శిబిరాల నిర్వహణలో రెడ్ క్రాస్ పాత్ర అసామాన్యమైనదని, విద్యార్థులు తమ వంతు బాధ్యతగా సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాజన్న గారు, దత్తాత్రి, నవీన్, ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం, విద్యార్థులు, యువత కేజీ టు పీజీ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకున్నారు.


