*విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం…
*పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలి..
*టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 3 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వివిధ కోర్సులను పూర్తి చేసుకున్నప్పటికీ వారి యొక్క సర్టిఫికెట్లను కళాశాలల నుండి విద్యార్థులు తీసుకోలేనటువంటి దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నదని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు తెలియజేశారు. కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని,విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నదని గత ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలనే అనుసరించడం సరికాదని అన్నారు.వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని లేకపోతే విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు టి సిద్ధమవుతుందని తెలియజేశారు. విద్యార్థులు నిరుద్యోగులను మోసం చేసినందుకే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని మరొకసారి అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి తప్పదని అన్నారు.
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…


