సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…

సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…

ఎల్లారెడ్డికి చేరుకున్న సిపిఎస్ జన జాగరణ యాత్ర..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 22 (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మరియు ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ వారి బృందం బుధవారం జనజాగన యాత్రల భాగంగా ఎల్లారెడ్డి చేరుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించారని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి వినతిపత్రం సమర్పించారు.

*అనంతరం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

*మా ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యల గురించి అసెంబ్లీలో మాటవలసిందిగా ఎమ్మెల్యే ని కోరారు.

*ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు.వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తన వానిని గట్టిగా వినిపిస్తానని హామీ ఇచ్చారు.

*అనంతరం స్థిత ప్రజ్ఞ గారు మాట్లాడుతూ వచ్చే నెలలో ఆగస్టు 23న హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభకు ది ఎల్లారెడ్డి డివిజన్లోని ఉద్యోగ ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కనిరాం ,జిల్లా బాధ్యులు గులాం షాకీర్, మహేష్, అనిల్, విశ్వనాధ్, రాజా గౌడ్, రవీందర్, శరణ్, రాజు, నరేష్, విజయ్, వినయ్ వాణి, పంచాయత్ సెక్రటరీలు, వార్డు ఆఫీసర్లు, లెక్చరర్లు,ట్రెజరీ ఉద్యోగులు, జిపిఓ లు, తదితరు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!