రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 22 (అఖండ భూమి న్యూస్);
ఢిల్లీలో ప్రధానమంత్రి నివాస ముట్టడి సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
షాపూర్ నగర్ నుంచి కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్ష నాయకులపై అనవసర చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ .చేశారు. అలాగే నీట్ పేపర్ లీకేజ్ కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు,మరియు కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


