చలో రాజ్ భవన్ కార్యక్రమంలో షబ్బీర్ అలీని పంజాగుట్ట పోలీసులు అరెస్టు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 22 (అఖండ భూమి న్యూస్);
లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపునిచ్చిన “చలో రాజ్ భవన్” కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న *రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని* రాజ్ భవన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో మంత్రి వివేక్ , ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్ , మందుల సామేల్ , శ్రీ శంకర్ , కుంభం అనిల్ కుమార్ రెడ్డి , పలువురు కార్పొరేషన్ చైర్మన్లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


