పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ…
జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి జె. వెంకటి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అఖండ భూమి న్యూస్);
(డి ఎం హెచ్ ఓ) ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ యూపీ హెచ్ సి, ఇస్లాంపురా యూపీహెచ్ సి , యు ఎఫ్ హెచ్ సి కామారెడ్డి కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో సమగ్ర సమీక్ష సమావేశం ఐ డి ఓ సి సమావేశ మందిరం లో మంగళవారం నిర్వహించారు.
ఈ సమావేశంలో జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్సీబీ ప్రోగ్రాం), జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం (ఎన్ టి సి పి), మాతా-శిశు ఆరోగ్య కార్యక్రమం (ఎం సి హెచ్ ప్రోగ్రాం) మరియు సార్వత్రిక టీకా కార్యక్రమం (యుఐపి) అమలుపై సుదీర్ఘంగా సమీక్షించారు.
*ముఖ్యంగా ఎన్ సి డి కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జిల్లాలో హైపర్‌టెన్షన్, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, నిర్ధారణ, చికిత్స, మందుల అందుబాటు, ఫాలో-అప్ సేవలు, డిజిటల్ నమోదు, లక్ష్యాల సాధన, ఆరోగ్య కేంద్రాల వారీగా పురోగతి, లోపాలు , వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సవివరంగా చర్చించారు.
అలాగే 30 సంవత్సరాలు పైబడిన ప్రజలందరికీ క్రమం తప్పకుండా ఎన్ సి డి స్క్రీనింగ్ నిర్వహించాలని, అర్హులైన ప్రతి వ్యక్తికి పరీక్షలు పూర్తి చేసి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సందర్శనల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎన్ టి సి పి క్షయ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
ఎం సి హెచ్ కార్యక్రమం కింద గర్భిణీల నమోదు, ప్రసవపూర్వ పరీక్షలు, అధిక ప్రమాద గర్భిణీల గుర్తింపు, సంస్థాగత ప్రసవాలు, ప్రసవానంతర సంరక్షణ, శిశు ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.
యుఐపి కార్యక్రమంలో ప్రతి చిన్నారికి, గర్భిణికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు పూర్తిగా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఒక్క అర్హులు మిగలకుండా టీకాకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
*ఈ సమీక్ష సమావేశంలో డా. రాజు, డిప్యూటీ డిఎంహెచ్ ప్రోగ్రాం అధికారులు డా. ప్రదీప్, డా. వెంకటస్వామి, డా. మోనిక (ఎపిడెమియాలజిస్ట్), బి. మహేందర్ రెడ్డి, డిప్యూటీ జిల్లా ఎక్స్‌టెన్షన్ & మీడియా అధికారి (డై డెమో . ), శ్రీనివాస్ రెడ్డి (ఏ ఎం ఓ), చలపతి (డి ఎస్ డి), సిద్ధిరామేశ్వర్, అశ్విని, వైద్యాధికారులు, పి హెచ్ సి /యు పి హెచ్ సి సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
చిన్న మల్లారెడ్డి లో ఈతవనం మొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ అధికారి ముకుందా రెడ్డి..
జాతీయ రహదారుల భద్రత, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై సమీక్ష సమావేశం…
*భవన నిర్మాణ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి,..
కామారెడ్డి ప్రజావాణిలో 121 దరఖాస్తులు స్వీకరణ…
లింగంపేట్ మండల టి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు తక్కెళ్ళ మోహన్ రెడ్డి


