చిన్న మల్లారెడ్డి లో ఈతవనం మొక్కలు నాటిన ఎక్సైజ్ శాఖ అధికారి ముకుందా రెడ్డి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అఖండ భూమి న్యూస్);
వనమహోత్సవంలో భాగంగా ఈతమొక్కలు
వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఈతమొక్కల నాటే కార్యక్రమాన్ని ఘనంగా మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈతమొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
అలాగే, రాష్ట్రంలో ఈత చెట్ల పెంపకం గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఎంతో ఉపయోగకరమని, ఈతమొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధికి కూడా తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో AES అరుణ్ చంద్ర, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సంపత్ కృష్ణ, సబ్ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, APO అన్నపూర్ణ, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీ జాన్, ఫరీద్, కానిస్టేబుళ్లు ఘోరీ, శ్రీ రాజు, శ్రీ దినేష్, శరత్, శ్రీ పవన్, బాబు పాల్గొన్నారు.
అదేవిధంగా గ్రామ సర్పంచ్ భీమయ్యల లక్ష్మీ రాజు, ఉప సర్పంచ్ శ్రీ లక్ష్మీ నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు ధర్మగోని కిషన్ గౌడ్, ట్రెజరర్ రాజేందర్ గౌడ్, సంఘ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, రాజా గౌడ్, అంజా గౌడ్, శ్యామ గౌడ్, ప్రశాంత్ గౌడ్, నర్సా గౌడ్ తదితరులు పాల్గొని ఈతమొక్కలను నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
You may also like
పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ…
జాతీయ రహదారుల భద్రత, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై సమీక్ష సమావేశం…
*భవన నిర్మాణ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి,..
కామారెడ్డి ప్రజావాణిలో 121 దరఖాస్తులు స్వీకరణ…
లింగంపేట్ మండల టి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు తక్కెళ్ళ మోహన్ రెడ్డి


