జాతీయ రహదారుల భద్రత, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై సమీక్ష సమావేశం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అఖండ భూమి న్యూస్);
భారత సుప్రీంకోర్టు Suo మోటు డబ్ల్యూ పి (సి) నెంబర్9/2025 (నిండ్రి పాలోడీ యాక్సిడెంట్) కేసులో జారీ చేసిన ఆదేశాల అమలు, జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా చర్యలు, వివిధ శాఖల సమన్వయంపై మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎన్‌హెచ్‌ఏఐ డీజీఎం ఆర్. శాలిని, ఆర్ & బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్, జిల్లా రవాణా అధికారి టి. సంతోష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్ల గుర్తింపు మరియు సత్వర పరిష్కారం, హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్స్, క్రాష్ బ్యారియర్లు, స్ట్రీట్ లైటింగ్, రోడ్డు భద్రతా మౌలిక వసతుల అభివృద్ధి, అత్యవసర వైద్య స్పందన వ్యవస్థ బలోపేతం, రహదారి ఇంజినీరింగ్ లోపాల సవరణ, వివిధ శాఖల మధ్య సమన్వయంతో సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై విస్తృతంగా చర్చించారు.
అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేసి సుప్రీంకోర్టు ఆదేశాలను సమయానికి పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అధికారులు తమ తమ శాఖల పరిధిలో చేపట్టిన చర్యలను వివరించి, పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తి చేసి జిల్లా స్థాయి అనుసరణ నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


