*భవన నిర్మాణ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి,..
లేబర్ కోట్లను రద్దు చేయాలి..
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యలను విడనాడాలి..
*చంద్రశేఖర్ సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 20 (అఖండ భూమి న్యూస్);
భవన నిర్మాణ సిఎస్ సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెంబర్ 12 ను సవరించి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండే సంక్షేమ పథకాలు అందించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించి అడిషనల్ కలెక్టర్ విక్టర్ సార్ కి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద భీమా మరణానికి 10 లక్షలు సహజమానానికి రెండు లక్షల పెంచుతూ శాశ్వత పక్షిక అంగవైకల్యం ఈ నాలుగు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 12 ను జూలై తేదీ 22 7 2025 నా విడుదల చేసింది. ఈ జీవోను విడుదల చేసిన రెండు రోజులకే ప్రైవేటు బీమా కంపెనీలైన క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి 250 కోట్లు ఏర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 94 కోట్లు ట్రయల్ బేజర్ అనే బ్రోకర్స్ సంస్థ ద్వారా 346 కోట్లు ప్రైవేటు బీమా కంపెనీలకు అక్రమంగా బదిలీ చేశారు అని అన్నారు. 1996 భవన నిర్మాణ కార్మికులు కేంద్ర చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం దుర్మార్గం కార్మికులకు అవసరంలేని సిఎస్ సంస్థ హెల్త్ టెస్టులు చేస్తూ బోర్డు నిధులను దుబ్బాక చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే సిఎస్ హెల్త్ టెస్టులను రద్దుచేసి కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అన్నారు 1996 బాండ్న నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరి కమిటీని నియమించి వా నిర్ణయం ప్రకారమే బోర్డు నిధులు ఖర్చు చేయాలి కానీ వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కంపెనీ నియమించకుండా ప్రభుత్వము కార్మిక శాఖ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి ఎలాంటి గుర్తింపు లేని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములను అప్పగించి కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 2029 నుండి 2025 వరకు బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులు 20 లక్షలు మంది ఉండగా 15 లక్షల మందిని మాత్రమే రెన్యువల్ చేసి ఒక్కొక్క కార్మికుడికి ప్రీమియం 239 రూపాయలు చొప్పున 15 లక్షల మంది కార్మికులకు 346.36 కోట్లు ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టారు. 13 లక్షలకు పైగా కార్మికుల కార్డులు రెన్యువల్ చేయకుండా వారికి అన్యాయం చేస్తున్నారు అని అన్నారు. ప్రస్తుతం బోర్డు అమలు చేస్తున్న 12 రకాల స్కీముల్లో నాలుగు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి మిగతా ఎనిమిది స్కీములైన వివాహ కానుక ప్రస్తుత కానుక హాస్పిటల్ ఖర్చులు దాన సంస్కారాల ఖర్చులు వంటి తదితర స్కీములను ప్రభుత్వం బోర్డు అధికారులు కార్మికులకు అందకుండా చేస్తున్నారు అని అన్నారు. కార్మికులకు హెల్త్ టెస్టుల పేరుతో సిఎస్ఐ సంస్థకు 463 కోట్లు దోచుపెట్టారు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా దారిమల్లిస్తూ కార్మికులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాలు సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 12 సవరించి ఇన్సూరెన్స్ కంపెనీలకు కాకుండా ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేపదకాలు అందించాలనీ డిమాండ్ చేశారు.అక్రమంగా భీమా కంపెనీలకు ఇచ్చిన 36 కోట్ల బోర్డులో జమ చేయాలి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ కు నిధులు వెంటనే విడుదల చేయాలి రెన్యూవల్ కానీ 13 లక్షల మంది కార్మికుల బోర్డు కార్డులను యుద్ధ ప్రతిపాదన రెన్యువల్ చేయాలని లేకపోతే కార్మికులందరిని సవరించి పెద్ద ఎత్తున ఆందోళనలో పోరాటాల నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సాయిబాబా, ఈశ్వర్ ,భూపతి రెడ్డి, శివరాజు ,లింగం, భూమయ్య ,రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


