*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
కేంద్ర ప్రభుత్వం బిజెపి పార్టీపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు బైండ్ల రామస్వామి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 22 (అఖండ భూమి న్యూస్);
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు బైండ్ల రామస్వామి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అరెస్టులు అప్రజాస్వామికమని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం విఫలం నిరసన చేయడం ప్రజల హక్కు స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికి లేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన దానికి నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని తీవ్రంగా మండిపడ్డారు.
విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న నీట్ (నీట్) పేపర్ లీకేజీపై కేంద్రాన్ని నిలదీసినందుకే అగ్రనేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండి పడ్డారు.కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేయడం మానుకొని, నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
“శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం బిజెపి ప్రభుత్వం అరాచకాలు దారుణమని కాంగ్రెస్ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు బైండ్ల రామ స్వామి ఆరోపించారు.
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…
చలో రాజ్ భవన్ కార్యక్రమంలో షబ్బీర్ అలీని పంజాగుట్ట పోలీసులు అరెస్టు …


