సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…

సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…

టీయూ రిజిస్ట్రార్ యాదగిరి..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 22: (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన “తరంగ్–2026” వార్షికోత్సవం (వార్షికోత్సవంలో భాగంగా ) కార్యక్రమం బుధవారం ఉత్సాహభరితంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కావని, విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటాలని సూచించారు. లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ సౌత్ క్యాంపస్ లో వివిధ విభాగాలు సాధించిన ప్రగతిని వివరించారు. తాము కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. భవిష్యత్ లో జరగబోయే అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారం కూడా అవసరమని తెలిపారు.పరిశోధనలోనూ, విద్యార్థులకు ఉద్యోగ కల్పన కోసం కట్టుబడి ఉన్నామని తెలిపారు. విద్యార్థులు తాము చదువుకొని సమాజానికి సేవ చెయ్యాలని తెలిపారు. సౌత్ క్యాంపస్ అభివృద్ధికి పై అధికారులతో సమన్వయంతో పని చేస్తామని తెలిపారు.

కార్యక్రమానికి డా. ప్రతిజ్ఞ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, హాస్టల్ వార్డెన్ లు డా.యాలాద్రి,డా.సునీత, అధ్యాపకులు డా.అంజయ్య, డా.లలిత,డా.హరిత,డా. సబిత ,డా.నాగరాజు,డా.కవిత తోరణ్, డా.నారాయణ,,డా.రమాదేవి,డా.నర్సయ్య,వైశాలి,డా.నిరంజన్ ,శ్రీకాంత్,దిలీప్,డా.శ్రీమాత, డా.ఇంద్రకరణ్,డా.కనకయ్య,శ్రీకాంత్ గౌడ్,శ్రీనివాస్,విజయ్,సునీల్ ,మహిపాల్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!