దోమకొండలో కాంగ్రెస్ పార్టీ ధర్నా.. అడ్డుకున్న పోలీసులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా దోమకొండలో అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్షలో లీకులకు కారణమైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే , కేంద్ర విద్యా శాఖ మంత్రి, ప్రధానమంత్రి వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దోమకొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ను అక్కడినుండి పంపించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశ బోయిన శ్రీనివాస్, సర్పంచ్ ఐరన్ నరసయ్య, తీగల తిరుమల గౌడ్, అనంతరెడ్డి, సీతారాం మధు, తాటిపల్లి శ్రీకాంత్, పిన్నం నాగేంద్ర వర్మ, కదిరే గోపాల్ రెడ్డి, షమ్మీ, మహమ్మద్, మాజీ వార్డు సభ్యులు అబ్రబోయిన రాజేందర్, సాయబు గారి రాజు, మహీం, అబ్రబోయిన సత్తయ్య, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


