ఇది ముక్తు భారత్ కార్యక్రమం విజయవంతం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 3 (అఖండ భూమి న్యూస్);
టిబి ముక్తుభారత్ కార్యక్రమంలో భాగంగా దోమకొండలో బుధవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ లు శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శ్యాం కుమార్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహకారంతో ఛాతి పరీక్షలు నిర్వహించారు. 119 మందికి పరీక్షలు నిర్వహించారు. సంపూర్ణ సురక్ష కేంద్రం, లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రమీల, సూపర్వైజర్ ప్రేమలత, ఎంపీహెచ్ఏలు సునీత, సంజీవి, సుధా, ఎస్ ఎస్ కే అవుట్ రిచ్ వర్కర్ కృష్ణమూర్తి, లింకు వర్కర్ బాలకిషన్, ఎక్స్రే మేనేజర్ దత్తాద్రి, , దోమకొండ గ్రామ ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, జిపి పాలకవర్గం సభ్యులు, దోమకొండ ఏ మరియు బి ఆరోగ్య ఉప కేంద్రాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


