విద్యుత్ ఘాతాంతో యువకుడి దుర్మరణం…!
కళ్ల ముందే కన్నుమూసిన కొడుకు
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ప్రతినిధి కురుపాటి గణేష్
(అఖండ భూమి)జూన్ 04
చండూరు మండలం..
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం చొప్పరివారిగూడెం లో బుధవారం విషాదం చోటుచేసుకుంది..విద్యుత్ ఘాతానికి గురై చొప్పరి చందు (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు..గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చందు ప్రమాదవశాత్తు పొలంలో వద్ద ఉన్న విద్యుత్ తీగలను తాకాడు..దీంతో అతడు తీవ్ర విద్యుత్ విఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి చందును కాపాడేందుకు ప్రయత్నించిన ప్పటికీ ఫలితం లేకపోయింది..కరెంట్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చందు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు..కంటికి రెప్పలా కాపాడుకుంటూ, చేతికి అందివచ్చిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు..చందు మరణంతో చొప్పరి వారిగూడెంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై శివకుమార్ తెలిపారు…
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…



