ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారం, కాంగ్రెస్ నేత కాసాల జనార్ధన్ రెడ్డి కృషితో గుండ్రపల్లికి నూతన బస్సు సర్వీస్…!

గ్రామంలో బుధవారం నాడు ఘనంగా బస్సును ప్రారంభించిన గ్రామస్తులు..దశాబ్దాల కల నెరవేరడంతో హర్షాతిరేకాలు
ప్రతినిధి కురుపాటి గణేష్ (అఖండ భూమి)జూన్ 04
చండూరు మండలం. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం గుండ్రపల్లి గ్రామ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది..స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారం, మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాసాల జనార్ధన్ రెడ్డి నిరంతర కృషితో నల్లగొండ డిపో నుండి గుండ్రపల్లి గ్రామానికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ మంజూరైంది..ఈ నూతన బస్సును బుధవారం నాడు గుండ్రపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు అత్యంత వైభవంగా, ఘనంగా ప్రారంభించారు..ఈ సందర్భంగా గ్రామ నాయకులు మరియు ప్రజలు మాట్లాడుతూ.. గుండ్రపల్లి గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు మరియు వ్యాపారులు నల్లగొండకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల కష్టాలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాసాల జనార్ధన్ రెడ్డి..ఈ సమస్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంలోనూ, నిరంతరం ఫాలోఅప్ చేయడంలోనూ ఎంతో కృషి చేశారని కొనియాడారు..గ్రామస్తుల విన్నపానికి తక్షణమే స్పందించి, ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధతో రవాణా శాఖ ద్వారా నూతన బస్సు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, మరియు ఇందుకు ఎంతగానో శ్రమించిన కాంగ్రెస్ నేత కాసాల జనార్ధన్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు..ఈ నూతన బస్సు సర్వీస్ ప్రారంభం కావడంతో గుండ్రపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు, నిత్యం నల్లగొండకు ప్రయాణించే వారికి ఎంతో మేలు చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు..తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజా నాయకులకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు, ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు కురుపాటి గణేష్, కాంగ్రెస్ పార్టీ గుండ్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాసాల పాండురంగారెడ్డి, ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు వందనపు నరేందర్, ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్, 4వ వార్డు సభ్యులు తిరుమణి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గుండ్రపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కురుపాటి శ్రీను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలవర్తి శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్కూరి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుర్రి వెంకట్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది బుర్రి సత్తిరెడ్డి, తీగల కృష్ణయ్య, కలగోని మల్లయ్య గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు మరియు గ్రామ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…


