ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఉచిత రక్త పరీక్షల కార్యక్రమం ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 4 (అఖండ భూమి న్యూస్);
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బిక్నూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించి, మహిళలకు నిర్వహిస్తున్న రక్త పరీక్షల తీరును పరిశీలించారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఇటువంటి పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స పొందాలని సూచించారు.
మహిళా సంఘాల సభ్యులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువవుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవీందర్, సర్పంచ్ చైర్మెన్, తహసీల్దార్, డి ఆర్ డి ఓ దామోదర్ రెడ్డి, ఏ డి ఎల్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, మండల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…



