దోమకొండ అంగన్వాడి సెంటర్లో డ్రెస్ యూనిఫామ్ లు పంపిణీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 04 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని 33 అంగన్వాడి సెంటర్లలో, అందులో పలుగడ్డ సెంటర్ నంబర్ 142 లో బాలురకు 616 యూనిఫామ్ బాలికలకు 596 మొత్తం 1212 యూనిఫాములను దోమకొండ గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య, పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఇన్చార్జి మంత్రి సీతక్క సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు అంగన్వాడి సెంటర్లకు విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తీగల తిరుమల్ గౌడ్, అనంతరెడ్డి, సీతారాం మధు,గోపాల్ రెడ్డి, గ్రామ పంచాయతీ సభ్యులు నరసింహులు ,అంగన్వాడి టీచర్ సీతారాం బూదమ్మ తదితరులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


