కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ డీఏసీ షోకాజ్ నోటీసు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 04. (అఖండ భూమి న్యూస్) ;
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
డీఏసీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవి మరియు డీఏసీ ఉపాధ్యక్షుడు శ్యామ్ మోహన్ అనంతుల సంయుక్తంగా జారీ చేసిన నోటీసులో, కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలకు సంబంధించిన పత్రికా కథనాలు, అలాగే ఇతర
పేలుడు పదార్థాలతో సంబంధించిన కేసు, మరియు మున్సిపాలిటీలోని పాత సామాను అమ్మిన కేసు మరియు భూ కబ్జాలపై కేసు అలాగే అతనిపై దాదాపు 13 ఎఫ్ఐఆర్లు 420 కేసులు ఆధారలతో సహా వచ్చిన ఆరోపణలపై కమిటీ దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావించారు.
అదేవిధంగా, పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించాయనే ఆరోపణలు కూడా నోటీసులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయి లిఖితపూర్వక వివరణను ఏడు రోజులలోగా, అంటే 11 జూన్ 2026 లోపు డీఏసీకి సమర్పించాలని చంద్రశేఖర్ రెడ్డిని నోటీసు ద్వారా ఆదేశించారు.
ఫిర్యాదులు మరియు ప్రాతినిధ్యాల ప్రతులను కూడా నోటీసుకు జతచేసినట్లు టీపీసీసీ డీఏసీ వెల్లడించింది. వివరణ అందిన అనంతరం పార్టీ నియమ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలపై కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


