మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి* మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్

బెల్లంపల్లి జూన్ 04(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక –99 రోజుల కార్యక్రమం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక –99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల డీసీపీ భాస్కర్ బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ 7వ వార్డ్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు,యువత భవిష్యత్తుపై, ఆరోగ్యంపై అలాగే కుటుంబ వ్యవస్థపై అది చూపే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు.మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని సూచించారు.అలాగే ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ ఆన్‌లైన్ మోసాలు,ఓటీపీ మోసాలు,ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీములు,సోషల్ మీడియా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయన సూచించారు.ఎలాంటి అనుమానాస్పద కాల్స్,మెసేజ్‌లు లేదా లింక్‌లకు స్పందించవద్దని,సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసిపి తెలిపారు.అలాగే మహిళల భద్రత కోసం పోలీసుశాఖ చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించి,మహిళలకు ఎలాంటి వేధింపులు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. యువత బండి నడిపెటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ బెల్లంపల్లి పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు..మాదక ద్రవ్యాల నిర్మూలన,సైబర్ నేరాల నివారణ మహిళల భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్,మున్సిపల్ ఛైర్మన్,బస్తీ వాసులు,యువత, మహిళలు,పోలీసు సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…


