నూతన కల్వర్ట్ కు భూమి పూజ చేసిన చైర్ పర్సన్
బెల్లంపల్లి జూన్04(అఖండ భూమి న్యూస్):గత కొన్ని రోజులుగా బెల్లంపల్లి పట్టణంలోని,బెల్లంపల్లి బస్తీ 19వ వార్డ్ లో కల్వర్టు కుంగిపోయి బస్తీ ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు,బెల్లంపల్లి మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు తీర్మానించిన విధంగా మున్సిపాలిటీ గ్రాంట్ నిధులు రూ.5లక్షల నిధులతో నూతన కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.నూతన కల్వర్టు నిర్మాణంతో బస్తీ ప్రజలు,వాహనదారుల కష్టాలు తీరనున్నాయని మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు.ఈ కార్యక్రమంలో 19వ వార్డ్ కౌన్సిలర్ సిమ్రాన్ షేక్,మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ గౌస్,కాంపెల్లి శ్రీనివాస్,ప్రదీప్ గారు,మరికొంత మంది సీనియర్ నాయకులు,బస్తీ వాసులు ఈట రాకేష్ తదితరులు పాల్గొన్నారు…
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…



