రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైంది…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అఖండ భూమి న్యూస్);
సీఎం కనిపిస్తే టీవీలు కట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి ప్రజలు ఇష్టపడటం లేదు అని మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ప్రజల దృష్టిలో అబద్ధాల కోరుగా, దుర్మార్గుడిగా, చేతకాని సీఎంగా, మోసకారిగా సీఎం మిగిలిపోయాడు అని అన్నాడు.
పదేళ్లు రాష్ట్రంలో జనరంజక పాలన సాగించిన కేసీఆర్
రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు అని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడెలా ఉన్నాయి అని గుర్తు చేశారు.
కేసీఆర్ హయాంలో యూరియా సరఫరా ఎలా ఉండేది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి అన్నారు.
రైతులంటే రేవంత్ రెడ్డికి అంత చులకనా ఉందా ప్రశ్నించారు.
గతంలో 24 గంటలు వచ్చిన కరెంట్ 11 గంటలే వస్తుంది అని అన్నారు.
తెలంగాణలో మళ్ళీ మోటార్లు కాలిపోవడం మొదలైంది అని అన్నారు.
రాష్ట్రంపై సీఎం, మంత్రులు గద్దల్లా పడుతున్నారు అని విమర్శించారు.
వేలకోట్ల భూములు దోచుకుని తింటున్నారు అన్నారు.
14 ఎకరాల స్థలం ఫార్మా సిటీ కోసం భూములు సేకరించి పెడితే ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి దోపిడీకి ప్రయత్నిస్తున్నారు అని గుర్తు చేశారు.
సివిల్ సప్లైలో కుంభకోణానికి పాల్పడ్డారు అని అన్నారు.
ఎక్సైజ్ శాఖలో రూ.6 వేల కోట్ల కుంభకోణం జరిగింది అని అన్నారు.
వేణుగోపాల స్వామి ఆలయానికి సంబందించిన 116 ఎకరాల భూమిపై కన్నేశారు అని అన్నారు.
ప్రస్తుతం రైతు డిస్కం పేరుతో దోపిడీకి కుట్ర లేపారు గుర్తు చేశారు.
ఆదాయం వచ్చే డిస్కంలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు విమర్శించారు.
గతంలో రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసేది అని అన్నారు.
ఫ్యాక్టరీలు, కమర్షియల్స్ మీద వచ్చే ఆదాయాన్ని రైతుల కోసం ఖర్చు చేసేవారు అని అన్నారు.
ప్రస్తుతం ఆదాయం వచ్చేవి ప్రైవేటుకు, పైసా కూడా ఆదాయం రానివి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు విమర్శించారు.
ఇవ్వన్నిటిని గట్టిగా అడిగితే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నయా పైసా ఇవ్వడం లేదు అని అన్నారు.
పైపెచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు అన్నారు.
హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేయనున్న ఆర్.ఆర్.ఆర్ ను కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది తెలిపారు.
రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు అన్నారు.
ఆర్.ఆర్.ఆర్ ను ఎందుకు రిజెక్ట్ చేశారో కిషన్ రెడ్డి అడగాలి అన్నారు.
రైతు డిస్కంలను మోడీ పెడితే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు అన్నారుఎం
తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి రైతు డిస్కంల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేశారు.
కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్నారు.
తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని టీడీపీ నేతలు అంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఖండించడం లేదు అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ తో పోలిస్తే అడ్డుకునే వాళ్ళు లేకుండా పోయారు అని అన్నారు.
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…


