*రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 4 (అఖండ భూమి న్యూస్);
రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
గత 12 సంవత్సరాలుగా రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల అభివృద్ధి ధ్యేయంగా రెడ్ల సంక్షేమమే లక్ష్యంగా వివిధ రూపాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనంద రోజుల్లో కూడా ఈ నూతన కమిటీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ పూర్తిస్థాయిలో ఏర్పాటు అయ్యేంతవరకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా అన్నారు.
రాష్ట్ర కమిటీ లో వరుసగా మూడవసారి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి గారిని నియమించారు
ఈ సందర్భంగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ విధంగా అయితే రెడ్ల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం సాగించాము ఇప్పుడు కూడా తనవంతు గా ఎల్లప్పుడూ పేదరిల్ల సంక్షేమం కోసం రెడ్డి నిరుద్యోగ యువతీ యువతుల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వాలు తీసుకొస్తానని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతామని ఈ సందర్భంగా అన్నారు
నాపై నమ్మకం ఉంచి ఈ యొక్క పదవి బాధ్యతను కట్ట పెట్టినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు నాగర్త చంద్రారెడ్డి , ప్రధాన కార్యదర్శి సందీప్, తిరుపతిరెడ్డి ,సహాధ్యక్షులు నాగిరెడ్డి లింగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ,సుమన్ రెడ్డి ,బండ గోపాల్ రెడ్డి ,రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…


