చరిత్రకు పుట్టినిల్లు – అభివృద్ధికి చిరునామా: మన కామారెడ్డి జిల్లా సంపూర్ణ విశ్లేషణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 5 (అఖండ భూమి న్యూస్);
నేను పెంజర్ల మహేందర్ రెడ్డి, అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడిగా మన కామారెడ్డి గడ్డ పుట్టుపూర్వోత్తరాలు, పాలించిన మహానుభావులు, నేటి అభివృద్ధి గురించి నా మనసులోని మాట మీ ముందు ఉంచుతున్నాను.
*1. కామారెడ్డి పేరు ఎలా వచ్చింది? పాలించిన రాజులు ఎవరు?
*_మన కామారెడ్డికి ఆ పేరు *దోమకొండ కోటను పాలించిన చిన్న కామిరెడ్డి మహారాజు *గారి పేరు మీదుగా వచ్చింది. ఆయన క్రీ.శ. 1600 నుండి 1640 వరకు ధర్మంగా, న్యాయంగా ఈ ప్రాంతాన్ని పాలించారు. అంతకు ముందు ఈ ఊరి పేరు *”కొడూరు” కొడూరు హనుమండ్ల గుడి, కిష్టమ్మ గుడి, వేణుగోపాల స్వామి గుడి, విట్టలేశ్వర గుడి మన ఊరి వేల సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్ష్యాలు.
*_మనల్ని పాలించిన రాజవంశాలు:_
*_1) అస్మక మహాజనపదం, శాతవాహనులు:_ తెలుగు నేల తొలి వెలుగులు.
*__2) కాకతీయులు:_ *కాకర్త్య గుండన మహారాజు పాలించారు. మాచారెడ్డి మండలం బండ రామేశ్వర పల్లి రాజరాజేశ్వర స్వామి గుడిలో ఆయన శాసనం ఇప్పటికీ ఉంది. కాకతీయుల పాలనలో చెరువులు, గుడులు వెలిశాయి.
*_3) కొండవీడు రెడ్డి రాజులు:_ 1325-1448 వరకు సుభిక్షంగా పాలించారు.
*__4) కామినేని వంశం:_ దోమకొండ కోటను నిర్మించి 300 ఏళ్లు పాలించిన ధర్మమూర్తులు.
*__5) నిజాం నవాబులు:_ 1724 నుండి 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్నాం.
2. దోమకొండ సంస్థానం – తెలుగు నేల కీర్తి కిరీటం
మన కామారెడ్డి గడ్డకు వన్నె తెచ్చిన సంస్థానం దోమకొండ సంస్థానం కామినేని వంశ రాజులు ఈ కోటను నిర్మించి, కళలను, కవులను, పండితులను పోషించారు. దోమకొండ కోట గోడలు నేటికీ ఆ రాజుల పరాక్రమాన్ని, పరిపాలనా దక్షతను చెప్తాయి.
దోమకొండ రాజులు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారు. చెరువులు తవ్వించారు, గుడులు కట్టించారు, బాటసారులకు సత్రాలు వేయించారు. హిందూ ధర్మాన్ని కాపాడారు. నేటికీ దోమకొండ సంస్థానం వారి వంశీయులు ప్రజల్లో గౌరవంగా బతుకుతున్నారు. వారి ఆశీస్సులు కామారెడ్డి జిల్లాపై ఎప్పుడూ ఉండాలి._
కామారెడ్డి కింద ఉన్న ఇతర సంస్థానాలు:_
1) బాన్సువాడ సంస్థానం_ – పూర్వం “బానవాసవాడి-70” అని పిలిచేవారు.
వ్యవసాయానికి పెట్టింది పేరు.
*__2) ఎల్లారెడ్డి సంస్థానం_* *విద్యకు, వైద్యానికి పేరు.
*__3) కౌలాస్ కోట సంస్థానం_ – చరిత్ర గలిగిన కోట.
*_ఈ సంస్థానాల రాజులందరూ ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నారు. వారి పాలనలోనే కామారెడ్డి ప్రాంతం సస్యశ్యామలమైంది.
*3. పోలీస్ పటేల్, మాలి పటేల్ వ్యవస్థ – అప్పటి పరిపాలన.
*_నిజాం కాలంలో ప్రతి గ్రామానికి పోలీస్ పటేల్, మాలి పటేల్, పట్వారీ అనే పెద్ద మనుషులు ఉండేవారు. వీళ్లు లేనిదే గ్రామ పాలన సాగేది.
పోలీస్ పటేల్:_ ఊరికి పెద్ద దిక్కు. గొడవలు పరిష్కరించేవారు. దొంగల భయం లేకుండా కాపలా కాసేవారు. పన్నులు సరిగా వసూలు చేసి నిజాం సర్కారుకు పంపేవారు. ఊరి లెక్క మొత్తం ఆయన దగ్గర ఉండేది.
మాలి పటేల్:_ ఎవరి పొలం ఎంత, ఎవరు ఎంత పన్ను కట్టాలి అని లెక్క రాసేవారు. భూమి కొలతలు వేసేవారు. పటేల్ అంటే ఊరికి ఒక గౌరవం, ఒక నమ్మకం._
4. పటేల్ రాజిరెడ్డి గారి గొప్పతనంఎం
*ఎల్_1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దయవల్ల మనకు నిజాం పాలన నుండి విముక్తి వచ్చింది. ఆ తర్వాత పటేల్ వ్యవస్థ పోయి వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ వచ్చింది._
_*కానీ కామారెడ్డి ప్రజల గుండెల్లో “పోలీస్ పటేల్ రాజిరెడ్డి గారు”ఎప్పటికీ నిలిచిపోయారు. ఆయన స్వాతంత్ర్యం వచ్చాక VROగా పనిచేశారు. పోలీస్ పటేల్ ఇంట్లో పుట్టి, ప్రజాసేవ ఒంటబట్టించుకున్నారు.
రాజిరెడ్డి గారు అంటే ఎందుకు అంత గౌరవం?_
_1) నిజాయితీ:_ ఆయన హయాంలో ఒక్క ఎకరం భూమి రికార్డు కూడా తప్పుగా రాయలేదు. లంచం అనే మాట ఎరుగరు. పేదోడి కన్నీళ్లు తుడిచే మనిషి.
_2) అన్ని పార్టీల వాడు:_ కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, బిజెపి అయినా, కమ్యూనిస్టు అయినా – “రాజిరెడ్డి గారు అయితే న్యాయం జరుగుతుంది” అని అందరూ నమ్ముతారు. ఆయన ఎప్పుడూ పార్టీలు చూడలేదు, మనుషుల్ని చూశారు.
*__3) నేటికీ పెద్ద దిక్కు:_ రిటైర్ అయ్యి 20 ఏళ్లు దాటినా, కామారెడ్డిలో ఏ పెళ్లి జరిగినా, ఏ చావు జరిగినా, ఏ భూమి తగాదా వచ్చినా “ముందు పటేల్ గారిని పిలవండి” అంటారు. ఆయన మాటకు ఎదురులేదు. ఊరికి పెద్ద మనిషి అంటే ఆయనే గౌరవ్.
*_ఇలాంటి నిజాయితీ గల, నిబద్ధత గల అధికారులు ఈ రోజుల్లో దొరకడం కష్టం. రాజిరెడ్డి గారు కామారెడ్డికి దొరికిన వరం. ఆయన లాంటి వాళ్లు మరింత మంది రావాలి.
*5. కామారెడ్డి – వ్యవసాయమే జీవనాధారం, మంచి మనుషుల గడ్డ
*_మన కామారెడ్డి పూర్తిగా *వ్యవసాయం మీద బతికే జిల్లా*ఇక్కడి మట్టిలో పసిడి పండుతుంది. ఇక్కడి మనుషులు బంగారం. చాలా మంచివాళ్లు, అమాయకులు, ముక్కుసూటి మనుషులు. కష్టపడి పనిచేసుకుంటారు, అన్నం పెట్టి ఆదరిస్తారు.
పాత కాలంలో మన ప్రాంతంలో *చెరకు *విపరీతంగా పండేది. ఇందిరా షుగర్స్, గాయత్రి షుగర్స్ అనే రెండు పెద్ద ఫ్యాక్టరీలు ఉండేవి. రైతులు చెరకు వేసి హాయిగా బతికేవారు. ప్రతి ఇంట్లో *నల్లబెల్లం వండేవారు. ఆ బెల్లం వాసన ఊరంతా గుమగుమలాడేది. ఆ రుచి ఇప్పటి పిల్లలకు తెలియదు. *మొక్కజొన్న కూడా కళ్లకి అందినంత దూరం పండేది. పశువులకు మేతకు, మనుషులకు తిండికి కొదవ ఉండేది కాదు.
వరి, పసుపు, పత్తి, కంది మన ప్రధాన పంటలు. నిజాంసాగర్ ప్రాజెక్ట్, మంజీరా నది మన పొలాలకు ప్రాణం పోస్తున్నాయి. అందుకే మన జిల్లాను”తెలంగాణ వరి కూడు” *అని గర్వంగా పిలుచుకుంటాం. వందల కొద్దీ రైస్ మిల్లులు, బీడీ కార్మికులు మన జిల్లాకు ఆయువుపట్టు.
*6. స్వాతంత్ర్యం తర్వాత మన ఎమ్మెల్యేలు – ఎవరు ఏం చేశారు?..
*_1952 నుండి మనకు సేవ చేసిన ఎమ్మెల్యేలు:_
*_1952: వి వెంకట్రావు,, జి. విట్టల్ రెడ్డి 1957: టి ఎన్ సదాలక్ష్మి- మన తొలి మహిళా ఎమ్మెల్యే, దళితుల ఆడబిడ్డ | 1962: విఠల్ రెడ్డి గారి వెంకటరమరెడ్డి | 1967: ట్టల్ల్ ఏం రెడ్డి| 1972: వై సత్యనారాయణ | 1978: బి బాలయ్య బి బాలయ్య| 1983: పార్సి గంగయ్య | 1985: ఏ కృష్ణమూర్తి | 1989: మహమ్మద్ అలీ షబ్బీర్| 1994: గంప గోవర్ధన్ | 1999: | 2004: యూసఫ్ అలీ, షబ్బీర్ అలీ | 2014, 2018: గంప గోవర్ధన్| 2023: కె.వి రమణారెడ్డి.
You may also like
మొబైల్ రీఛార్జ్‌లపై మళ్లీ భారం..? త్వరలో టారిఫ్‌ల పెంపుకు సంకేతాలు..!
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచా వైజాగ్ బీచ్…
రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వ నమోదు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
రైతులకు నష్టం జరగకుండా తడిసిన వరిని వెంటనే తరలించాలి…
మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్


